మంచిర్యాల జిల్లాలో రూ.2 కోట్ల బీమా డబ్బు కోసం... భర్తను చంపించిన భార్య!
- రూ.2 కోట్ల బీమా డబ్బు కోసం భర్తను హత్య చేయించిన భార్య
- రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం
- ప్రియుడితో కలిసి రూ.10 లక్షల సుపారీ ఇచ్చినట్లు పోలీసుల వెల్లడి
- భార్య భారతి, ప్రియుడు సురేందర్‌తో పాటు మరొకరి అరెస్ట్
- ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపిన పోలీసులు
మంచిర్యాల జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వెనుక దారుణమైన హత్య కోణం దాగి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సుమారు రూ.2 కోట్ల బీమా డబ్బు కోసం, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి ఓ భార్య సుపారీ ఇచ్చి చంపించినట్లు తేల్చారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. హాజీపూర్ మండలం గూడిపేట గ్రామానికి చెందిన శైని కుమార్ (45) మే 22వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తొలుత కేసు నమోదైంది. అయితే, మృతుడి తల్లి లక్ష్మి తన కొడుకు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో శైని కుమార్ భార్య భారతికి అదే గ్రామానికి చెందిన సురేందర్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు, వారిద్దరూ కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసినట్లు తేలింది.
ఈ కుట్రలో భాగంగా రామ్ మల్లేష్ అనే వ్యక్తికి రూ.10 లక్షల సుపారీ ఇచ్చి, అడ్వాన్సుగా రూ.2 లక్షలు చెల్లించారు. పథకం ప్రకారం, మే 22న శైని కుమార్‌కు నిందితులు ఫుల్లుగా మద్యం తాగించి, ఇనుప సుత్తితో తలపై మోది హత్య చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని, బైక్‌ను రోడ్డుపై పడేసి పరారయ్యారు.
ఈ కేసు వివరాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. హత్యకు పాల్పడిన భార్య భారతి, ఆమె ప్రియుడు సురేందర్, సుపారీ తీసుకున్న వారిలో ఒకడైన శ్రీరామ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మరో ప్రధాన నిందితుడు రామ్ మల్లేష్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితుల నుంచి బీమా పత్రాలు, రూ.25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.